Friday, 2 September 2016

జియో సంసెల్‌‌నం తక్కువ ధరకే అపరిమిత కాలింగ్‌, డేటా ప్రకటించిన రిలయన్స్‌ టెలికం రంగంలో నూతన విప్లవం

మీ మొబైల్‌ నుంచి ఫోన్‌ చేస్తే రెండు మూడు నిమిషాలు కాగానే ఎంత బిల్లు అవుతుందనే ఆందోళన మొదలవుతుంది. ఇకపై ఈ ఆందోళనే ఉండదు. అన్నీ మాటలే..., అవన్నీ ఉచితమే. ఎంతసేపైనా మాట్లాడుకోవచ్చు. వినటానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమే. ముఖేష్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ గ్రూపు సంస్థ అయిన రిలయన్స్‌ జియో తీసుకురాబోతున్న పెను మార్పు ఇది. జియో సేవలతో రిలయన్స్‌ దేశంలో డిజిటల్‌ విప్లవాన్ని సృష్టించబోతోంది.
జియో ఛార్జీలు
జనవరి 1 నుంచి ఛార్జీలుంటాయి.
కాలింగ్‌ ఉచితం. 1 జీబీ డేటా రూ.50.
వినియోగం పెరిగే కొద్దీ డేటా ధర తగ్గుతుంది.
వివిధ ఛార్జీలతో మొత్తం 10 ప్రాథమిక పథకాలుంటాయి.(ప్లాన్స్‌)
పండగలు.. ప్రత్యేక రోజుల్లో ప్రత్యేక ఛార్జీలు లేవు.
డేటా వేగం
జియోలో గరిష్ట వేగం 135 ఎంబీపీఎస్‌
జియోలో సరాసరి 4జీ వేగం 18 ఎంబీపీఎస్‌*
ఎయిర్‌టెల్‌ సరాసరి 4జీ వేగం 5.4 ఎంబీపీఎస్‌
వొడాఫోన్‌ సరాసరి 4జీ వేగం 6.4 ఎంబీపీఎస్‌
ఐడియా సరాసరి 4జీ వేగం 12.6 ఎంబీపీఎస్‌
ఎయిర్‌సెల్‌ సరాసరి 4జీ వేగం 5.9 ఎంబీపీఎస్‌
ఆధారం: ఓపెన్‌ సిగ్నల్‌ (*కొన్ని ప్రాంతాల్లో పరీక్షించినపుడు)
ఇంకా
జియో నెట్‌వర్క్‌ 4జీ మాత్రమే కాకుండా 5జీ.. 6జీకి కూడా సపోర్ట్‌ చేస్తుంది.
దేశంలో పది లక్షల వైఫై హాట్‌స్పాట్‌లు ఏర్పాటు చేస్తారు.
కేవలం ఆధార్‌ నంబరు.. వేలి ముద్రతో జియో సిమ్‌ తీసుకోవచ్చు.
ఇవి ఉచితం
అన్నివేళలా
అపరిమిత కాలింగ్‌
లోకల్‌, ఎస్డీడీ తేడా లేదు
రోమింగ్‌ లేదు (దేశంలో ఎక్కడికెళ్లినా ఇన్‌కమింగ్‌ కాల్స్‌కి రుసుము లేదు)
తెల్లవారు జామున 2 నుంచి అయిదు గంటల మధ్య అపరిమిత డేటా
డిసెంబర్‌ 31 వరకు
అపరిమిత కాలింగ్‌
4జీ డేటా
రిలయన్‌ జియో యాప్స్‌
డిసెంబర్‌ 31, 2017 వరకు
నెలకు రూ.1250 చందా కలిగిన రిలయన్స్‌ జియో యాప్స్‌ ఉచితం. ఈ ప్రీమియం యాప్స్‌ ద్వారా సినిమాలు.. పాటలు.. ఇతర ప్రత్యేక సేవలను పొందవచ్చు.
ఇతర నెట్‌ వర్క్‌ల ఛార్జీలు
ఎయిర్‌టెల్‌ వొడాఫోన్‌లు కూడా ఇలాంటి ప్లాన్‌లే ప్రారంభించాయి.
జియోతో పోల్చినపుడు వీటి ధరలు చాలా అధికం.
ఎయిర్‌టెల్‌లో అపరిమిత వాయిస్‌కాలింగ్‌ ప్లాన్‌ రూ.949తో మొదలవుతుంది.
వొడాఫోన్‌లో 1 జీబీ 3జీ డేటా ధర రూ.147 వరకు ఉంది.
దాదాపు అన్ని టెలికం సంస్థల్లోనూ 1జీబీ 4జీ డేటా ఖరీదు రూ.200.. ఆపై ఉంది.
(ఆధారం బెర్న్‌స్టెయిన్‌ రీసెర్చ్‌)
విద్యార్థులకు ప్రత్యేకం
విద్యార్థులు గుర్తింపు కార్డు చూపించి జియోలో 25% అదనపు డేటాను పొందొచ్చు
జియో లక్ష్యం
ఏడాదిలో 10 కోట్ల వినియోగదారులు

No comments:

Post a Comment