Sunday, 4 September 2016

ఖైర‌తాబాద్ గణేషున్నీ వ‌ద‌లని జియో

రిలయెన్స్ కంపెని జియో ప్రకటనలు రోజు రోజుకూ పెరిగపోతున్నాయి. మొన్న ప్రధాని నరేంద్ర మోడీ ముఖచిత్రంతో వచ్చిన జియో వాణిజ్య ప్రకటనలపై విపక్షాలు ఆయనను సేల్స్ మ్యాన్ ఆప్ ద ఇయర్ గా విమర్శించారు. ఆ ఘటన మరువక ముందే ఇప్పుడు భాగ్యనగరంలో వెలసిన ఖైర‌తాబాద్ గణేషునిపై ఆ కంపెనీ కన్ను పడింది. రిల‌యెన్స్ జియో కంపెనీ ప్రకటనలతో  ఆ గ‌ణ‌నాథుని మండపాన్ని పూర్తిగా జియో అడ్వర్టైజ్ మెంట్లతో నింపేశారు.
ఎక్క‌డ చూసినా జియో అంటూ ప్ర‌జ‌లు ఎగ‌బ‌డుతున్నారు. మొన్న ముఖేశ్ అంబానీ కంపెనీ మీటింగ్ లో భారీ ఆఫ‌ర్లు ప్ర‌క‌టించిన అనంత‌రం క‌స్ట‌మ‌ర్లు విప‌రీతంగా పెరిగిపోయారు. సుమారు 10 కోట్ల మంది క‌స్ట‌మ‌ర్ల‌ను ఆక‌ర్షించ‌డ‌మే కంపెనీ ల‌క్ష్యంగా పేర్కొన్నారు జియో అధినేత‌.
భాగ్య‌న‌గ‌రంలోనే కాదు వేరే రాష్ట్రాల్లోనూ రిల‌యెన్స్ డిజిట‌ల్ స్టోర్ల ఎదుట ప్రజలు భారీగా క్యూ కడుతున్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లో ఆ రద్దీని కంట్రోట్ చేయలేక నానా ఇబ్బందులు పడుతున్నారు ట్రాఫిక్ పోలీసులు.
బీహార్ మాజీ ముఖ్య‌మంత్రి లాలు ప్ర‌సాద్ యాద‌వ్ ప్ర‌జ‌ల‌కు కావ‌ల‌సింది అట్టా..డాటా కాదని వ్యాఖ్య‌నించారు. ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ మిస్ట‌ర్ రిల‌యెన్స్ అని ప్ర‌ధానిని సంబోధించిన సంగ‌తి తెలిసిందే.

No comments:

Post a Comment